కడప జిల్లాలో ముస్లిం భక్తులతో వెంకన్న ఆలయం కిటకిటలాడుతోంది.. దీంతో.. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది దేవుని కడపలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం.. అయితే, ఉగాది రోజున శ్రీనివాసునికి పూజలు, అభిషేకాలు నిర్వహించి బత్యం చెల్లించడం ముస్లింలకు ఆనవాయితీగా వస్తోంది..
తిరుమల ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 26,401 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన వారు 12,401 మంది భక్తులు. హుండి ఆదాయం రూ.2.18 కోట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నెల 8వ తేదీన శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఏకాంతంగా రథసప్తమి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది టీటీడీ. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి దేవుని కడప వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అక్కడ కూడా ఏకాంతంగా…