తిరుమల ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 26,401 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన వారు 12,401 మంది భక్తులు. హుండి ఆదాయం రూ.2.18 కోట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నెల 8వ తేదీన శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.
ఏకాంతంగా రథసప్తమి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది టీటీడీ. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి దేవుని కడప వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అక్కడ కూడా ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. 15వ తేదీన సర్వదర్శనం భక్తులకు ఆఫ్ లైన్ విధానంలో టోకేన్లు జారీపై నిర్ణయం తీసుకోనుంది టీటీడీ. గతంలో విడుదల చేసిన అన్ని టోకెన్లు నిముషాల వ్యవధిలోనే అమ్ముడయ్యాయి. దీనిని బట్టి ఆఫ్ లైన్ టికెట్లకు కూడా భారీగానే డిమాండ్ వుంటుందని టీటీడీ భావిస్తోంది.