Devulapalli Krishna Shastri: తెలుగు చిత్రసీమలో పాటల పందిరి అంటే ప్రఖ్యాత దర్శకులు బి.యన్.రెడ్డి రూపొందించిన ‘మల్లీశ్వరి’నే ముందుగా చెప్పుకోవాలి. అందులో ప్రతీ పాట సందర్భోచితంగా అమృతం చిలికింది. అందుకు బి.యన్. కళాతృష్ణ ఓ కారణమయితే, ఆయన మదిని చదివి మరీ సాహిత్యం చిలికించిన ఘనత దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రిదే! దేవులపల్లి వారి వాణికి అనువుగా సాలూరు రాజేశ్వరరావు బాణీలు సాగాయి. అందుకే ‘మల్లీశ్వరి’ ఓ పాటల పందిరిగా ఈ నాటికీ సాహితీ సువాసనలు వెదజల్లుతూనే ఉంది.…
భావకవులు ఎవరికీ అర్థం కాని పాటలు రాసుకొని తమ ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారని కొందరి విమర్శ. అయితే ఊహాలోకంలో విహరించమనే ఐన్ స్టీన్ వంటి మేధావులు సైతం సెలవిచ్చారు. నేటి ఊహ, రేపటి వాస్తవం కావచ్చునని శాస్త్రజ్ఞులు కూడా అంగీకరిస్తున్నారు. తెలుగునేలపై భావకవితకు పట్టం కట్టి ఊరూరా, వాడవాడలా పలువురు యువకవులను ఊహాలోకాల్లో విహరింప చేసిన ఘనుడు దేవులపల్లి వేంకటకృష్ణ శాస్త్రి. ఆయన భావకవితకు జేజేలు పలికారు జనం. వాస్తవికతకు దూరంగా ఉండే భావుకత ఎంతవరకు సమంజసం…