‘బింబిసార’ సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్, ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘అమిగోస్’ కాగా మరొకటి అభిషేక్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘డెవిల్’. ఈ రెండు సినిమాల్లో ‘అమిగోస్’ షూటింగ్ పార్ట్ దాదాపు కంప్లీట్ అయ్యిందని సమాచారం. ఇక ‘డెవిల్’ సినిమా విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ ‘బ్రిటిష్ స్పై’గా కనిపించనున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కి సూపర్బ్…
లయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ కు ఇప్పుడు టైమ్ బాగుంది. 'భీమ్లానాయక్' మూవీతో ఏ ముహూర్తాన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందో కానీ... చక్కని విజయాన్ని అందుకోవడంతో పాటు... 'బింబిసార'లోనూ ఛాన్స్ పొందింది. నిజం చెప్పాలంటే... సంయుక్త మీనన్ ముందుగా సైన్ చేసిన సినిమా ఇదేనట.
నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ తదుపరి చిత్రం “డెవిల్” రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో అతను బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నాడు. ‘బాహుబలి’ తరువాత తెలుగు చిత్రనిర్మాతలు, హీరోలు పాన్-ఇండియన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. “డెవిల్” కూడా అదే బాటలో నడుస్తున్నాడు. 1945లో బ్రిటిష్ ఇండియా, మద్రాస్ ప్రెసిడెన్సీలో జరిగిన సంఘటనలకు సంబంధించిన భారీ బడ్జెట్ డ్రామా “డెవిల్”. “డెవిల్” మేకర్స్ ప్రముఖ సాంకేతిక నిపుణులు ప్రొడక్షన్ డిజైనర్ రామకృష్ణ, ఆర్ట్ డైరెక్టర్…
నందమూరి కళ్యాణ్ రామ్ గత కొంతకాలంగా తెర వెనుక ఎంత హోమ్ వర్క్ చేస్తున్నాడో ఇవాళ ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రకటిస్తున్న సినిమాలను చూస్తే అర్థమైపోతోంది. ఒకటి కాదు రెండు కాదు మూడు, నాలుగు సినిమాలను కళ్యాణ్ రామ్ క్యూలో పెట్టాడని తెలుస్తోంది. అందులో ‘డెవిల్’ లాంటి పాన్ ఇండియా మూవీ ఉండటం విశేషం. ఇంతవరకూ కళ్యాణ్ రామ్ ఈ సినిమాపై పెదవి విప్పిందే లేదు. ‘బాబు బాగా బిజీ’ ఫేమ్ నవీన్ మేడారం దర్శకత్వంలో…