హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్లలోని దేవాదుల మూడో దశ ప్యాకేజీ-3 పంప్‌హౌస్ మోటార్లు ఎట్టకేలకు ఆరంభం అయ్యాయి. రాత్రి వరకు పలు కారణాలతో మొరాయించిన మూడో దశలోని దేవన్నపేట పంపు హౌస్ మోటర్లు ప్రారంభమయ్యాయి. దీంతో గోదావరి జలాలు ధర్మసాగర్ రిజర్వాయర్‌కు చేరుకున్నాయి. మోటార్లు ఆన్ కావడంతో.. అధికారులు, మెగా కంపెనీ, ఆస్ట్రియా దేశ ఇంజినీర్లు ఆనందం వ్యక్తం చేశారు. దేవన్నపేట వద్ద ఉన్న దేవాదుల పంప్ హౌస్ ప్రారంభం కాకపోవడంతో.. సాగునీరు అందక రైతులు…