నేడు టాప్ స్టార్ గా సాగుతున్న ‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్ కెరీర్ లో మరపురాని, మరచిపోలేని చిత్రంగా ‘దేశముదురు’ నిలచింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన తొలి చిత్రమిది. ఈ సినిమా బన్నీ కెరీర్ లో పలు రికార్డులను నమోదు చేసింది. బన్నీ కెరీర్ లో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం చూసిన సినిమాగానూ, ఆయన నటజీవితంలో డైరెక్ట్ గా సిల్వర్ జూబ్లీ జరుపుకున్న ఏకైక చిత్రంగానూ నిలచింది. అప్పట్లో బన్నీ మూవీస్ లో…