మొన్నటి వరకు కరోనా…ఇప్పుడేమో వైరల్ ఫీవర్లు…ఢిల్లీని టెన్షన్ పెడుతున్నాయ్. వారం రోజుల్లోనే 3వందల మంది డెంగీతో ఆస్పత్రుల్లో చేరారు. దీంతో ఢిల్లీ సర్కార్…కరోనా వార్డులను డెంగీ రోగులకు కేటాయించాలని నిర్ణయించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఒకవైపు కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే…మరోవైపు డెంగీ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతుండటంతో…ఆస్పత్రులన్నీ వైరల్ ఫీవర్ బాధితులతో నిండిపోతున్నారు. దీంతో కేజ్రీవాల్ సర్కార్ అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు కేటాయించిన పడకల్లో మూడో వంతు పడకలు… డెంగీ రోగుల కోసం కేటాయించాలని…