ప్రభుత్వ పెద్దల నుంచి సామాన్యుల వరకు అందరూ కార్పొరేట్ వైద్యానికే ప్రాధాన్యత ఇస్తున్న ప్రస్తుత రోజుల్లో ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె నిండు గర్భిణీ కావడంతో శుక్రవారం నాడు పురిటి నొప్పులతో సామాన్య మహిళగా ఖమ్మంలోని ప్రభుత్వ దవాఖానాకు వెళ్లి టెస్టులు చేయించుకున్నారు. అనంతరం వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. ఈ మేరకు శనివారం ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని…