బతుకు బండిని లాక్కెళ్లేందుకు ఒక్కొక్కరిది ఒక్కోక్క దారి. ఏదో ఒకలా సంపాదించి పొట్ట నింపుకునే కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. ఏదోలా నాలుగు రాళ్లు సంపాదించి కుటుంబాన్ని, పిల్లల్ని పోషించుకుంటారు. దొరికిన పని చేస్తూ.. డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అలాగే ఓ వ్యక్తి తన రెండు చేతులు లేకున్నప్పటికీ తానే డెలివరీలు చేయడమే కాకుండా స్కూటర్‌ను స్వయంగా నడుపుతున్నాడు.