Shraddha Walkar case- delhi incident: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది శ్రద్ధావాకర్ హత్య కేసు. సహజీవనంలో ఉన్న ఆమెను అతని లవర్ అత్యంత కిరాతకంగా చంపేశాడు. మృతదేహాన్ని 35 భాగాలు చేసి ఓ ఫ్రిడ్జ్ లో దాచి 18 రోజుల పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పారేశాడు. ఆరు నెలల తర్వాత శ్రద్ధా తండ్రి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు అఫ్తాబ్ పూనావాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.