దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం బెంబేలెత్తిస్తోంది. బయటకు రావాలంటేనే హడలెత్తిపోయే పరిస్థితులు దాపురించాయి. పూర్తిగా గాలి నాణ్యత దెబ్బతింది. దీంతో పిల్లలు, వృద్ధులు, రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
Delhi Air Pollution News : దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉన్న దృష్ట్యా ప్రాథమిక పాఠశాలలను నవంబర్ 10వ తేదీ వరకు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ఆదివారం తెలిపారు.