ఢిల్లీ యువతి అంజలీ సింగ్‌ను కారు 12కి.మీ పాటు ఈడ్చుకెళ్లిన కేసు కీలక మలువులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరు అనుమానితులు బయటపడ్డారు. వ్యక్తులు కారు యజమాని అశుతోష్, నిందితులలో ఒకరి సోదరుడు అంకుష్ అని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు ఈ రోజు తెలిపారు.
ఢిల్లీ యువతి అంజలీ సింగ్‌ను కారు 12కి.మీ పాటు ఈడ్చుకెళ్లిన కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన ఈ కేసు.. నిరసనలతో కేంద్రంలోనూ కదలికలు తీసుకొచ్చింది. అయితే పోలీసు దర్యాప్తు పట్ల బాధిత కుటుంబం సంతృప్తిగా ఉన్నా.. ఇటీవల వాళ్లు ఇచ్చిన స్టేట్ మెంట్ ఈ కేసును మరో మలుపు తిప్పేలా కనిపిస్తోంది.