Senior Army Officer Assaults SpiceJet Staff: శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళ్లే స్పైస్‌జెట్ విమానం SG-386 బోర్డింగ్ గేట్ వద్ద ఒక సీనియర్ ఆర్మీ అధికారి నలుగురు స్పైస్‌జెట్ ఉద్యోగులను దారుణంగా కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జూలై 26న అదనపు క్యాబిన్ బ్యాగేజీని తీసుకెళ్లడానికి ఎక్స్‌ట్రా ఛార్జీలు చెల్లించమని సిబ్బందికి కోరగా ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
శుక్రవారం ఢిల్లీ నుంచి పూణే వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. దీని కారణంగా, ఈ విమానం తిరుగు ప్రయాణాన్ని ఎయిర్‌లైన్ రద్దు చేయాల్సి వచ్చింది. మార్గమధ్యలో పక్షి విమానాన్ని ఢీకొట్టిన విషయం పైలట్‌కు కూడా తెలియకపోవడం గమనార్హం. అయితే, పూణేలో ల్యాండింగ్ అయిన తర్వాత పక్షి ఢీ కొట్టినట్లు గుర్తించారు. దీంతో సంస్థ విమానం తిరుగు ప్రయాణాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ బృందం క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోందని ఎయిర్ ఇండియా తెలిపింది.…