చెట్టు మంచిదైతే దాని కాయ కూడా మంచిదని ఎంచాలని పెద్దలు అంటుంటారు. అసలు చెట్టే మంచిది కాదన్నప్పుడు కాయ ఎలా మంచిది అవుతుంది. కానే కాదు. ఇదంతా ఇప్పుడెందుకు అంటారా? ప్రస్తుతం ఢిల్లీ కారు బాంబ్ పేలుడు తర్వాత ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ‘‘అల్-ఫలాహ్ యూనివర్సిటీ’ పేరు.
Delhi Blast Case: ఢిల్లీ పేలుళ్ల కేసులో మరో సంచలన అంశం బయటపడింది. ఉగ్రవాది డాక్టర్ షాహీన్ సిద్ధిఖీ రెండు నెలల క్రితం లక్నోకు వెళ్లి అనేక మంది అనుమానాస్పద వ్యక్తులను కలిసిందని దర్యాప్తులో తేలింది. ఆమె పరిచయస్తులలో కొందరు అయోధ్య రామాలయాన్ని సైతం సందర్శించారని వర్గాలు చెబుతున్నాయి. లక్నోలో షాహీన్ ఎవర్ని కలిసింది? ఆమె ఎక్కడ బస చేసింది? అయోధ్యలో ఏదైనా కుట్ర జరిపారా..? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె లక్నోకు వచ్చినట్లు జమ్మూకశ్మీర్…
Delhi Car Blast: ఢిల్లీ ఉగ్రదాడిపై దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ దర్యాప్తులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఏజెన్సీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులు కేవలం i20 లేదా EcoSport కార్లను మాత్రమే కాకుండా, మరో రెండు పాత వాహనాలను పేలుడు పదార్థాలతో నింపడానికి సిద్ధమయ్యారు. అనేక ప్రదేశాల్లో దాడులు నిర్వహించడానికి వీలుగా అదనపు వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ సమాచారాన్ని అనుసరించి, ఏజెన్సీలు ఇప్పుడు ఈ అదనపు…
Delhi Car Blast: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బాంబు దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ మొహమ్మద్ గురించి ఓ ప్రధాన అంశం వెల్లడైంది. ఉమర్ పేలుడుకు ముందు ఓల్డ్ ఢిల్లీలోని ఒక మసీదుకు వెళ్ళాడు. ఎర్రకోట వైపు వెళ్ళే ముందు 10 నిమిషాలకు పైగా అక్కడే గడిపాడు. ఇది ఫైజ్-ఎ-ఇలాహి మసీదు. తుర్క్మాన్ గేట్ ఎదురుగా రాంలీలా మైదాన్ మూలలో ఉంది. నిజాముద్దీన్ మర్కజ్ లాగానే ఈ మసీదులో తబ్లిగీ జమాత్ జరుగుతుందని చెబుతున్నారు.…
ఢిల్లీ కారు బాంబ్ పేలుడు తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పేలుడు తర్వాత దేశ వ్యాప్తంగా డాక్టర్ల బృందం ఎన్ని కుట్రలు చేశారో తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఉగ్రవాది డాక్టర్ ఉమర్ భారీ దాడులకే ప్లాన్ చేశాడు. ఈనెలలోనే ప్రధాని మోడీ ప్రారంభించిన అతి పెద్ద దేవాలయంపై దాడి చేసేందుకు ప్రణాళిక రచించినట్లుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
Marko Rubio: ఢిల్లీ బాంబు పేలుళ్ల దర్యాప్తులో తమ దేశం భారతదేశానికి సహాయం అందించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బుధవారం అన్నారు. భారత దర్యాప్తు సంస్థలను ప్రశంసించారు. "భారత్‌కు చెందిన దర్యాప్తు సంస్థలు చాలా ప్రొఫెషనల్, ఖచ్చితమైన దర్యాప్తును నిర్వహించగల పూర్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి.
ఢిల్లీ బ్లాస్ట్‌కు సంబంధించిన మరొక వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో స్పష్టంగా కారు పేలిన దృశ్యాలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Delhi Bomb Blast: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న జరిగిన విధ్వంసకర బాంబు దాడి కేసు దర్యాప్తులో సంచలన విషయం బయటపడింది. పేలుడు పదార్థాలతో నిండిన హ్యుందాయ్ ఐ20 కారులో ఉన్న వ్యక్తి మరెవరో కాదు ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ (ఉమర్ మొహమ్మద్) అని పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు బుధవారం రాత్రి ఆలస్యంగా నిర్ధారించాయి. కారు శిథిలాల నుంచి వెలికితీసిన కాలిపోయిన మృతదేహానికి DNA పరీక్ష నిర్వహించగా.. ఉమర్ కుటుంబ సభ్యుల నమూనాలతో 100%…
Pakistan: భారతదేశంలో ఎప్పుడు ఉగ్రవాద దాడి జరిగిన, దాని మూలాలు పాకిస్తాన్‌లోనే ఉంటాయి. అయితే, ఈ నిజాన్ని ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఒప్పుకోదు. తమ ప్రమేయం లేదని చెబుతుంటుంది. ఈసారి కూడా అదే ప్రయత్నం చేసింది. ఢిల్లీ కారు బాంబ్ బ్లాస్‌ను తక్కువ చేసేలా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ ఉగ్రదాడి గురించి స్పందిస్తూ.. ‘‘గ్యాస్ సిలిండర్ పేలుడు’’గా ఆసిఫ్ అభివర్ణించారు. భారత్ రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని వాడుకుంటోందని ఆరోపించారు.
Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ పేలుడు ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డాక్టర్ నుంచి ఉగ్రవాదిగా మారిన ఉమర్ నబీ దుష్ట పథకం పన్నినట్లు తేలింది. బాబ్రీ మసీదును కూల్చేసిన డిసెంబర్ 6న దాడులు చేయాలని ప్లాన్ చేసుకున్నాడని అధికారులు తెలిపారు.