తాజాగా జరిగిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ పలువురు కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందులో కేఎల్ రాహుల్, డుప్లెసిస్ లాంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరించేంది. అయితే.. జట్టు అతన్ని వదులుకుంది. ఈ క్రమంలో.. జట్టు కెప్టెన్ ఎవరన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. కాగా.. మెగా వేలంలో లక్నోకు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్, ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌ను డీసీ తమ జట్టులో చేర్చుకుంది.