జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడులు దురదృష్టకరమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భద్రతలో ఎలాంటి లోపం లేదని చెప్పారు. ఉగ్రవాదులకు భద్రతా బలగాలు ధీటుగా సమాధానమిస్తున్నాయని తెలిపారు. గతంతో పోలిస్తే లోయలో దాడులు తగ్గాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు.
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) న్యూరో సర్జరీ విభాగంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేరారు. ఆయన వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం.
మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితిని అంచనా వేయాలని, భారత వైమానిక రక్షణ వ్యవస్థల పటిష్టతపై వైమానిక దళం దృష్టి పెట్టాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం టాప్ కమాండర్లను కోరారు.