MIB: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గత నాలుగు రోజుల నుంచి ఇటు భారత్, అటు పాకిస్తాన్ మీడియా ఛానెళ్లలో ఇదే ప్రధానాంశంగా మారింది. భారత మీడియా మిలిటరీ కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు నివేదిస్తోంది. ఇదిలా ఉంటే, మిలిటరీ కార్యకలాపాలకు సంబంధించిన కవరేజ్‌ని నిలిపేయాలని శనివారం సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) మీడియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది