పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి కర్ణాటక ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ కేశవ్ ప్రసాద్ తనపై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ శుక్రవారం బెంగళూరు కోర్టుకు హాజరయ్యారు.