బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. టీవలే ఆమె ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’కు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పుడామె మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. తాజాగా దీపికా.. ప్రముఖ మ్యాగజైన్ ‘ది షిఫ్ట్’ ప్రకటించిన ప్రభావవంతమైన మహిళల జాబితాలో నిలిచింది. వినోద రంగానికి గణనీయమైన సేవలందించిన వారికి ప్రతి ఏడాది ఈ గౌరవాన్ని అందజేస్తారు. ఇందులో భాగంగా ఈసారి మోషన్ పిక్చర్స్ విభాగంలో దీపిక ఎంపిక…