ఏపీలో ఇప్పుడు మూడు రాజధానుల అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. మూడు రాజధానులపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి ఎంత నష్టపోయామో అందరికీ తెలుసు. తమ ప్రభుత్వం అమరావతిలోనే ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా ఉండేందుకే మూడు రాజధానులు ఆలోచన చేస్తోందన్నారు. ఈ మూడురాజధానులకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న దశలో కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయి. అన్ని జిల్లాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు డిప్యూటీ సీఎం…