కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కుదిపేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక చిత్ర పరిశ్రమ అయితే కరోనా దెబ్బకు కుదేలయిపోయింది. ఇప్పుడిప్పుడే అన్నింటికి, అందరికి మంచి రోజులు వస్తున్నాయి.. త్యేతర్లు కళకళలాడుతున్నాయి అనుకొనేలోపు కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ బి.1.1.529 మరో సవాల్ విసురుతోంది. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని డబ్ల్యూహెచ్వో చెప్తున్న తరుణంలో ఓమిక్రాన్ కేసులు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఇక ఇప్పటికే వాయిదాల మీద వాయిదాల వేస్తూ వస్తున్నా సినిమాలు పరిస్థితి అయితే దారుణమని…