ఏపీలో బీజేపీ నేతలు అధికారపార్టీపై దాడి ముమ్మరం చేశారు. ఆత్మకూరులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజల విశ్వాసాన్ని వైసీపీ వమ్ము చేసిందన్నారు. నెల్లూరు జిల్లాలో పుష్కలంగా జలవనరులతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిఉన్నా…రైతులు అనధికారికంగా క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఏర్పడిందన్నారు. తుఫాన్ వల్ల నష్ట పోయిన రైతులకు నష్టపరిహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సంగం బ్యారేజ్ నిర్మాణ పనులు, సోమశిల ప్రాజెక్టు…