మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అహ్మద్ నగర్‌లోని సివిల్ ఆస్పత్రిలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్న ఐసీయూ వార్డులోనే ఈ ప్రమాదం జరిగింది. మంటల్లో కాలిపోయి కొందరు.. దట్టమైన పొగలతో ఊపిరాడక మరికొందరు మరణించారు. ఇప్పటి వరకు 10 మంది కోవిడ్ రోగులు మరణించినట్లు అహ్మద్‌నగర్ జిల్లా కలెక్టర్ రాజేంద్ర భోస్లే తెలిపారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని వివిధ ఆస్పత్రుల్లో గత కొంతకాలంగా జరుగుతున్న మరణాలు…