Lumpy skin Disease: రాజస్థాన్ రాష్ట్రంలో లంపీ స్కిన్ వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్ లో ఈ వ్యాధి బారిన పడిన పశువులు మరణిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ వ్యాధి ద్వారా మరణించిన పశువుల సంఖ్య 4 వేలను దాటింది. రాష్ట్రంలో 90,000లకు పైగా పశువులకు ఈ వ్యాధి సోకినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వ్యాధిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వెల్లడించారు.