వినికిడి లోపం లేదా చెవుడు వచ్చే ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. వయసు పెరిగే కొద్దీ చెవి వ్యాధులు రావడం సాధారణమని భావిస్తారు. అయితే ఇటీవలి నివేదికల ప్రకారం.. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రమాదం యువకులలో కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇటీవలి నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, ఇయర్‌బడ్‌లు.. హెడ్‌ఫోన్‌ల వాడకం పెరుగుతున్నందున వినికిడి లోపం.. చెవుడు కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.