భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు ఫోన్ చేశారు. అంతకుముందు, అమెరికా విదేశాంగ కార్యదర్శి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్‌కు కూడా ఫోన్ చేశారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. ఉద్రిక్తతలు తగ్గించుకునే చర్యలు చేపట్టాలని పాక్, భారత్ లకు రుబియో సూచించారు. Also Read:Operation Sindoor Director Apology: క్షమాపణలు చెప్పిన ‘ఆపరేషన్ సిందూర్’ డైరెక్టర్.. నా ఉద్దేశ్యం…
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక ప్రకటన చేశారు. దాడులు తక్షణమే తగ్గించాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఇరుదేశాల మధ్య చర్చలకు యూఎస్ మద్దతు ఉంటుందని వెల్లడించారు. అవసరమైతే భారత్, పాకిస్థాన్ మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రతిపాదించారు. హహల్గాం ఉగ్రదాడిని ఖండించిన రూబియో ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో…