మియాపూర్‌లోని హెచ్‌ఎండీఏ భూముల ఆక్రమణకు జనం యత్నించిన నేపథ్యంలో దీప్తిశ్రీనగర్‌లో పోలీసులు భారీగా మోహరించారు. మదీనాగూడలోని సర్వే నంబర్.100, 101లో ఉన్న స్థలంలో ఇళ్లు లేదా పట్టాలు ఇవ్వాలని ఆక్రమణదారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో పోలీసులపై ఆక్రమదారులకు రాళ్లదాడి చేశారు. దీంతో పోలీసులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియా సమావేశం నిర్వహించారు. డీసీపీ వినీత్ మాట్లాడుతూ.. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 100,101 సర్వే…