Sangareddy: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్‌లో భార్యను భర్త హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కేఎస్‌ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న వెంకట బ్రహ్మం అనే వ్యక్తి తన భార్య కృష్ణవేణిని ఈ రోజు ఉదయం బ్యాట్‌తో కొట్టి హత్య చేశాడు.. కృష్ణవేణి కోహీర్ డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త వెంకట బ్రహ్మం సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు ఇంటర్మీడియట్ చదువుతుండగా, కుమారుడు ఎనిమిదో తరగతి విద్యార్థి.