కాకినాడ జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం పెద్దాపురం. అధికార వైసీపీకి కలిసి రావడం లేదు ఈ సెగ్మెంట్. పెరుగుతున్న వర్గ విభేదాలతో పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతుందన్నది కేడర్ ఆందోళన. పెద్దాపురం వైసీపీ ఇంఛార్జ్‌గా దవులూరి దొరబాబు ఉన్నారు. ఫ్యామిలీ ప్యాక్ కింద మూడు కీలక పదవులను ఇంట్లో వాళ్లకు ఇచ్చుకుని కుటుంబ పాలనకు తెరతీశారనే విమర్శ ఆయనపై ఉంది. దొరబాబు ప్రస్తుతం రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్. ఆయన తల్లి పార్వతి సామర్లకోట మున్సిపల్ ఛైర్‌పర్సన్.…