ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే! భారీ స్కోరు (211) చేసినప్పటికీ.. బౌలర్ల పేలవ ప్రదర్శన కారణంగా బోల్తా కొట్టేసింది. దీంతో, ఈరోజు జరగనున్న రెండో టీ20లో ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ కసిగా ఉంది. అందుకు బౌలింగ్ విభాగంలో భారత్ పుంజుకోవాల్సి ఉంటుంది. బ్యాటింగ్ విషయంలో భారత్‌కి ఎలాంటి ఢోకా లేదు. ఆరో వికెట్ దాకా దూకుడుగా రాణించే బ్యాట్స్మన్లే ఉన్నారు.…