మద్దిశెట్టి వేణుగోపాల్. దర్శి వైసీపీ ఎమ్మెల్యే. బూచేపల్లి శివప్రసాదరెడ్డి.. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే. బూచేపల్లి వెంకాయమ్మ.. ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్. అంతా వైసీపీ నేతలే. వెంకాయమ్మ కుమారుడే శివప్రసాదరెడ్డి. బూచేపల్లి వర్గానికి.. మద్దిశెట్టి వర్గానికి మూడేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎవరి వర్గం వారిదే. దర్శి వైసీపీలో ప్రస్తుతం రెండు పవర్ సెంటర్స్ ఉన్నాయి. అందుకే సమస్య వస్తే పెద్ద చర్చకు దారితీస్తోంది. పార్టీ పెద్దలు అనేకసార్లు సయోధ్యకు ప్రయత్నించినా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు.…