పశ్చిమబెంగాల్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. డార్జిలింగ్‌లో కొండచరియలు విరిగిపడి దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు.
Darjeeling Tragedy: భారీ వర్షాల కారణంగా పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలోని మిరిక్ దగ్గర కొండ చరియలు విరిగిపడి 17 మందికి పైగా మృతి చెందారు. వర్ష బీభత్సంతో కొండచరియలు విరిగిపడటంతో డార్జిలింగ్- సిలిగురి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.