దేశవాళీ క్రికెట్‌లో నయా సెన్సేషన్. దులిప్ ట్రోఫీ టోర్నమెంట్‌లో బ్యాటర్ డానిష్ మలేవర్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. దులిప్ ట్రోఫీ తొలి క్వార్టర్ ఫైనల్లో భాగంగా నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ బ్యాటర్ మలేవర్ డబుల్ సెంచరీకి రెండు పరుగుల దూరంలో నిలిచాడు. మొదటిరోజు ఆటలో 35 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 198 పరుగులు బాదాడు. రెండో రోజు అతడు డబుల్ సెంచరీ మార్క్ అందుకునే అవకాశాలు ఉన్నాయి. విదర్భకు చెందిన…