KTM Adventure Rally: భారతదేశంలో చాలా మంది రైడర్లకు రేసింగ్, అడ్వెంచర్ రైడింగ్ అనేవి ఇప్పటికీ విదేశాల్లో మాత్రమే జరిగేవి అని భావిస్తుంటారు. టీవీల్లో రేసులు చూడటం, సోషల్ మీడియాలో అంతర్జాతీయ స్థాయి అడ్వెంచర్ రైడర్లను ఫాలో అవ్వడమే తప్ప, స్వయంగా అలాంటి అనుభవాన్ని పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.