Bike Stunts In Front Police Jeep: బీహార్‌లో హైవేపై కొందరు యువకులు చేసిన ప్రమాదకర బైక్ స్టంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రద్దీగా ఉన్న రహదారిపై ప్రాణాలను లెక్క చేయకుండా వారు చేసిన విన్యాసాలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసులు స్పందించి స్టంట్ చేసిన బైకర్లపై కేసు నమోదు చేశారు.