గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరంగల్ మహబూబాబాద్ రూట్ లో దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు అధికారులు. మూడు చోట్ల సుమారు వెయ్యి మంది సిబ్బందితో ట్రాక్ మరమ్మతు పనులను చేపడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే జీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్ష బీభత్సానికి రైల్వే వ్యవస్థ అతలాకుతలమైంది. రైల్వే ట్రాక్లు పలుచోట్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి. జోన్ పరిధిలో 101 రైళ్లు పూర్తిగా, మరో 8 పాక్షికంగా రద్దయ్యాయి. 68 రైళ్లను దారి…