Bihar Elections 2025: బీహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ జిల్లాలోని బైకుంత్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల అనంతరం.. హింస చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిధవాలియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బుచెయా గ్రామంలో ఒక దళిత కుటుంబంపై తీవ్రంగా దాడి చేశారు. బాధితుల ప్రకారం.. ఓటు వేసిన తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా కొంతమంది వారిని ఆపి బీజేపీకి ఓటు వేశారని ఆరోపిస్తూ కొట్టారు. ఈ సంఘటనలో ముగ్గురు గాయపడ్డారు. చికిత్స కోసం సదర్…