మేషం : ఈ రోజు ఈ రాశిలోని వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు గడిస్తారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం విరమించుకోవటం మంచిది. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వృషభం : ఈ రోజు ఈ రాశిలోని కొబ్బరి, పూలు, పండ్లు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ధనం కంటె ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. తల పెట్టిన పనులు అర్థాంతరంగా…