ఐఎండీ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ‘దానా’ తుఫాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో వాయవ్య దిశగా కదులుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ వెల్లడించారు. బుధవారం సాయంత్రానికి పారాదీప్ (ఒడిశా)కి 460 కిమీ., ధమ్రా(ఒడిశా)కు 490 కిమీ.,సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 540 కిమీ దూరంలో కేంద్రీకృతమైందన్నారు.