Nara Lokesh: గత ఐదు రోజులుగా రాష్ట్రంపై ప్రభావం చూపుతున్న భారీ తుఫాన్ ఈ రాత్రి సుమారు 11 గంటల సమయంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఇది తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావం దాదాపు 40 లక్షల మందిపై ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రాణ నష్టం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండకూడదనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతోందని మంత్రి లోకేష్…