ఏపీ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న ‘మొంథా’ తుఫాన్ బలహీనపడింది. తీవ్ర తుఫాన్.. తుఫాన్‌గా బలహీనపడింది. రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ మచిలీపట్నంకు 50 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయింది. తుఫాన్ ప్రభావంతో నేడు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్రలో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. Also Read: Daily Astrology:…