Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘బిపార్జాయ్’ తుఫాన్ రానున్న 12 గంటల్లో అత్యంత తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శనివారం తెలిపింది. గుజరాత్ లోని పోర్‌బందర్ తీరానికి 200-300 కి.మీ దూరంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే ఐదురోజులు గుజరాత్ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పాటు, బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.
బిపోర్‌జోయ్ తుఫాన్ ఉత్తర-ఈశాన్యల వైపు పయనిస్తున్నందున మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు-మధ్య అరేబియా సముద్రం వద్ద తీవ్రరూపం దాల్చింది.
Monsoon: ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆగనమనం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా జూన్ మొదటివారంలోనే రుతుపవానాలు కేరళ తీరాన్ని తాకాలి. అయితే ఇప్పటి వరకు కేరళను చేరుకోలేదు. జూన్ 4న రెండు రోజులు ఆలస్యంగా కేరళలోకి నైరుతి రుతుపవనాలు వస్తాయని ముందుగా భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) అంచనా వేసింది. అయితే అరేబియా సముద్రంలో ‘బిపోర్జాయ్’ తుఫాన్ ఏర్పడటంతో నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.