Home
Cyclone Arnab
Cyclone Arnab News
-
Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కశింకోటలో 26.3 సెం.మీ వర్షపాతం.. అంధకారంలో మచిలీపట్నం!
Kasinkota Records 26.3 CM Rainfall: అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కోస్తా జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు, కుండపోత వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మచిలీపట్నంలో రహదారులు నీటమునగ్గా.. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నగరంలోని పలు ప్రాంతాలు అంధకారంలో మునిగిపోయాయి. మరోవైపు కోనసీమలో తుఫాన్ ప్రభావంతో భారీగా ఆస్తి… -
Arnab Cyclone-School Holiday: తెలంగాణలోనూ తుఫాను ప్రభావం.. ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
Arnab Cyclone-School Holiday: బంగాళాఖాతంలో రూపుదిద్దుకున్న 'అర్నాబ్' తుఫాను తెలంగాణపై కూడా ప్రభావాన్ని చూపుతోంది. ఈ తుఫాను ధాటికి బుధవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల సాధారణ జనజీవనానికి తీవ్ర అంతరాయం కలగడమే కాకుండా, విద్యార్థులు, విద్యా సిబ్బంది భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని జిల్లా యంత్రాంగం భావించింది.… -
Cyclone Arnab: మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం.. కోనసీమ, గోదావరి జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు!
Cyclone Arnab Update: ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను అర్నబ్ తుఫాన్ వణికిస్తోంది. తీరం దాటే ప్రక్రియ గత రెండు గంటలుగా నెమ్మదిగా కొనసాగుతోందని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తీరానికి దగ్గరగా వచ్చిన తర్వాత తుఫాన్ వేగం బాగా తగ్గిందని, ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి నెమ్మదిగా కదులుతోందని వెల్లడించారు. ప్రస్తుతం నరసాపురానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, మధ్యాహ్నానికి పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. అర్నబ్ తుఫాన్… -
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీకి తెలంగాణ సాయం!
Telangana Sends Help to AP: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో విద్యుత్ పునరుద్ధరణ పనులకు అవసరమైన అదనపు సిబ్బంది, సామగ్రిని అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఏపీ సర్కారు కోరింది. ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ మేరకు తెలంగాణ విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్‌కు ఫోన్ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్… -
Cyclone Arnab Impact: తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. రాత్రంతా అధికారులకు దిశానిర్దేశం!
CM Chandrababu Reviews Cyclone Arnab Impact: అర్నబ్ తుఫాన్ ప్రభావంపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఆర్టీజీఎస్ అధికారులు, క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఉద్యోగులతో సీఎం సమీక్ష చేశారు. రాత్రంతా అర్నబ్ తుఫాన్ ప్రభావం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. క్షేత్ర స్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి 1:30 గంటల వరకు సీఎం పరిస్థితిని సమీక్షించారు. ఆ తర్వాత కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటూనే అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇవాళ… -
Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాను ‘అర్నబ్’ తీవ్ర తుఫాన్ కమ్ముకోవడంతో తీర ప్రాంతమంతా అంధకారంలో చిక్కుకుంది. కోనసీమ ప్రజలకు ఈ రాత్రి అత్యంత భీకరమైన కాళరాత్రిలా మ在రింది. తుఫాన్ ఉధృతి అంతకంతకూ పెరుగుతుండటంతో లంక గ్రామాల్లో ప్రకంపనలు పుడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారి ఏకంగా 2.5 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్న రాక్షస అలలు తీరాన్ని వణికిస్తున్నాయి. భీకర గాలుల ప్రళయం.. ప్రస్తుతం కోనసీమలో ఈదురు గాలుల తీవ్రత గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వీస్తుండగా, తుఫాన్… -
Arnab Cyclone Effect : అర్నబ్ బీభత్సం.. అనకాపల్లి తీరంలో భయానక పరిస్థితులు.!
బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న ‘అర్నబ్’ తీవ్ర తుఫాన్ అనకాపల్లి జిల్లాలో తన ప్రతాపాన్ని చూపుతోంది. ఉగ్రరూపం దాల్చిన ఈ తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల భారీ వేగంతో విరుచుకుపడ్డ భీకర గాలులకు జిల్లాలోని తీర ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. ముఖ్యంగా పూడిమడక, సీతపాలెం ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. ఎడతెరిపి లేకుండా దంచి కొడుతున్న భారీ వర్షానికి తోడు వీస్తున్న ఈదురు గాలుల తాకిడికి గంగపుత్రులు… -
Arnab Cyclone Alert: ‘అర్నబ్’ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ రాష్ట్రాలకు హెచ్చరికలు.. తెలంగాణాలోనూ భారీ వర్షాలు!
Arnab Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను 'అర్నబ్' మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారింది. విశాఖపట్నానికి కేవలం 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను, అక్టోబర్ 28 ఉదయం బాపట్ల, విశాఖ మధ్య యానం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని… -
Arnab Cyclone Alert: పెనుగండంగా ‘అర్నాబ్’ తుఫాన్.. కుంభవృష్టి వర్షాలు.. ఆ జిల్లాలకు పెను ముప్పు!
Arnab Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతానికి ‘అర్నాబ్’ తుఫాన్ పెను ముప్పుగా మారుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగండం తుఫాన్‌గా బలపడిందని వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం విశాఖకు 650, కాకినాడకు 730, మచిలీపట్నానికి 830, బాపట్లకు 900 కిలోమీటర్ల కేంద్రీకృతమై ఉందని ఐఎండీ పేర్కొంది. తీవ్ర తుఫాన్‌గా బలపడుతూ తీర ప్రాంతాల వైపు దూసుకొస్తోంది. ఈ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా మారే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.… -
Cyclone Arnab Alert: దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు!
Cyclone Arnab Latest Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ తుపానుగా మారుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ వాయుగుండం దక్షిణ దిశగా కదులుతూ.. ఆదివారం తీవ్ర వాయుగుండంగా బలపడింది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ ఈరోజు ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడనున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఆ తర్వాత మరింత బలపడి…
తాజావార్తలు
-
CM Chandrababu: “తక్షణమే ఆదుకోండి”.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఆ సీనియర్ జట్టు కెప్టెన్‌గా బుడ్డోడి నియామకం
-
Kaka Release: ‘కాకా’ వెనక్కి తగ్గేదే లే.. రూమర్లకు ‘రెస్ట్ ఇన్ పీస్’ చెప్పిన కోన వెంకట్!
-
Kalyan Padala : బిగ్ బాస్ విన్నర్ హీరోగా ‘హారర్ కామెడీ’ మూవీ
-
Sandiyar First Look: ‘సండియార్’ ఫస్ట్ లుక్ చూశారా? రఫ్ అండ్ రా లుక్‌తో కమల్ విధ్వంసం!
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!