VC Sajjanar: హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్, నగరంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే పోలీసింగ్ సాధ్యమని, ప్రతి పౌరుడు పోలీసుగా భావించి నేరాల గురించి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. సజ్జనార్ పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్ (ప్రజా సంక్షేమ పోలీసింగ్) అనే కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేశారు. ఇందులో లా అండ్ ఆర్డర్ నిర్వహణతో పాటు ప్రజల సంక్షేమంపై కూడా దృష్టి పెడతామని ఆయన వివరించారు. దీనిలో భాగంగా సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, అలాగే నకిలీ వస్తువులు, కల్తీ ఆహారం వంటి వాటిపై కూడా దృష్టి సారించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతామని తెలిపారు.
NEP vs WI: ఛీ.. ఛీ.. అసలు ఎలా గెలిచారో రెండు సార్లు ప్రపంచ కప్.. పసికూన చేతిలో వరుసగా రెండో పరాజయం
అలాగే సజ్జనార్ కొన్ని కీలక అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని స్పష్టం చేశారు. ఇందులో డ్రగ్స్ సమస్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టిందని చెప్పారు. డ్రగ్స్‌కు బానిసలైన యువత, కుటుంబాలు నష్టపోకుండా డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అలాగే సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్, స్టాక్ అడ్వైజర్ మోసాలు పెరిగాయని, ముఖ్యంగా పెన్షనర్లు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కష్టపడితేనే డబ్బు వస్తుందని, సులభంగా డబ్బు సంపాదించే పద్ధతులను నమ్మవద్దని కోరారు.
Tilak Varma: చాలా ఒత్తిడిలోనే బ్యాటింగ్ చేశా.. కళ్ల ముందు దేశమే కనిపించింది!
మరోవైపు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్‌లను, ఇతర ఆన్‌లైన్ మోసపూరిత యాప్‌లను ప్రచారం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల ఎంతోమంది కుటుంబాలు నష్టపోయాయని గుర్తు చేశారు. ఇక నగరంలోని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని, రోడ్డుపై ప్రజల సమయం తగ్గించేందుకు కృషి చేస్తామని చెప్పారు. డ్రంకెన్ డ్రైవింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తామని, తాగిన మత్తులో డ్రైవింగ్ చేయడం ఒక రకంగా ‘రోడ్ టెర్రరిజం’ వంటిదని అభివర్ణించారు. అలాగే ముఖ్యంగా మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇక నగరంలో నేరాలను తగ్గించడంలో, నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, వాటి ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉందని అన్నారు.