కడప జిల్లా గండికోటలో యువతి వైష్ణవి మర్డర్ మిస్టరీ.. ఇప్పటికీ గండికోట రహస్యంగానే ఉంది. ఆమెను ఎవరు హత్య చేశారో ఇప్పటి వరకు ఓ నిర్ధారణకు రాలేకపోతున్నారు పోలీసులు. ప్రియుడే హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కానీ ప్రియుడి పాత్ర లేదని పోలీసులు తేల్చారు. ఇంతకీ పలు మలుపులు తిరుగుతున్న వైష్ణవి హత్య కేసులో ప్రధాన పాత్రధారులెవరు? హత్యా, పరువు హత్యా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. కడప జిల్లా గండికోటలో మైనర్ బాలిక వైష్ణవి…
విజయ్ దేవరకొండ కేసు లో కమిషనర్ విచారణకు రాకపోతే డీజీపీని రప్పించాల్సి ఉంటుంది అంటూ హెచ్చరించింది జాతీయ ఎస్టీ కమిషన్. తాజాగా సైబరాబాద్ పోలీసులపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్ అయింది. అసలు విషయం ఏమిటంటే ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా వేడుకలో గిరిజనుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. Also Read : Bhahubali : ‘బాహుబలి’ రీరిలీజ్‌పై జక్కన్న గ్రాండ్ అప్డేట్.. ఇదే…
Cyberabad Police: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ జోన్ లోని స్పా సెంటర్ల యజమానులతో పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని AHTU (ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్), లా అండ్ ఆర్డర్ విభాగం, స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సమావేశంలో ప్రజల భద్రత, ట్రాఫికింగ్ నివారణ, చట్టబద్ధ కార్యకలాపాలుపై దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. ఎక్కడైనా చట్టాన్ని ఉల్లంఘించే స్పా సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం…
హైడ్రా పేరు చెప్పిబెదిరించిన ఇరువురిపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. మిరియాల వేదాంతం, యెలిసెట్టి శోభన్ బాబు గండిపేట మండలం, నెక్నాంపూర్ విలేజ్‌లోని అల్కాపూర్ టౌన్‌షిప్‌లో ఓ ఇంటికి వెళ్లి బెదిరించినట్టు పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. ఈ నెల 23న మధ్యాహ్నం 3.20 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. నలుపు రంగు కారులో వచ్చిన ఈ ఇద్దరు ఇంటి ఆవరణలోకి వచ్చి పరిశీలిస్తుండగా.. ఎవరని అడిగితే తాము హైడ్రా నుంచి వచ్చామని బదులిచ్చారని…
ఆర్మీకి చెందిన ఓ ఇంజనీరింగ్ కాలేజీలోకి అక్రమంగా చొరబడ్డ నలుగురు ఆగంతకులు.. తాము ఎయిర్ ఫోర్స్ అధికారులం అంటూ నకిలీ ఐడీ కార్డులు చూపించి బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. చివరికి అసలు బండారం బయటపడడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ అంశంపై తాజాగా నార్త్ జోన్ డీసీపీ రేష్మి పరిమళ స్పందించారు. తిరుమలగిరీ ఆర్మీ కాలేజ్ లో అగంతకులు చొరపడ్డ కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. నార్త్ జోన్…
పెట్టుబడి పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బై బ్యాక్ పాలసీ ద్వారా అనతి కాలంలోనే ఒకటికి రెండింతలు డబ్బులు ఇస్తామంటూ చెప్పి బాధితులను నట్టేటా ముంచేశారు. ఏవీ ఇన్ఫ్రాకాన్ పేరిట ఈ భారీ మోసం చేశారు.
మంగ్లీ బర్త్ డే పార్టీ వ్యవహారంలో బిగ్ బాస్ దివి కూడా ఇరుక్కుంది. పోలీసులకు ఆమె సహకరించకుండా దురుసుగా ప్రవర్తించినట్టు పోలీసులు వెల్లడించడంతో ఆమె మీద మీడియా ఫోకస్ చేస్తోంది. ఈ క్రమంలో ఆమె ఒక వాయిస్ నోట్ రిలీజ్ చేసింది. Also Read:Mangli Party Issue : పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన దివి మీడియా మిత్రులకు చిన్న రిక్వెస్ట్ , ఇప్పుడు ఫ్రెండ్ బర్త్ డే పార్టీ అని వెళితే మనం అక్కడ ఏం జరిగితే…
మంగ్లీ బర్త్ డే పార్టీ వివాదంగా మారింది. స్నేహితులు, బంధువుల మధ్య ఉల్లాసంగా జరుపుకోవాలనుకున్న బర్త్ డే పార్టీ పోలీస్ స్టేషన్ కు చేరింది. ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించడం, లిక్కర్ సరఫరా చేయడం, గంజాయి తాగిన వ్యక్తి పట్టుబడటంతో కేసు నమోదు వరకు వెళ్ళింది. సరిగా బర్త్ డే రోజే చేవెళ్ల పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ పై కేసు నమోదు అయింది. త్రిపుర రిసార్ట్స్ లో విపరీతమైన సౌండ్ పొల్యూషన్ తో పార్టీ…
డ్రగ్స్ను ఎక్కడికి అక్కడ కట్టడి చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు.. కానీ గ్రామ స్థాయిల వరకు డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందని అధికారులు గుర్తించ లేకపోతున్నారు.. ఏకంగా జాతీయ రహదారుల వెంబడి ఉన్న దాబాలు హోటల్స్లో ఈ డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుంది..
Safety Of Children: ఇటీవల కాలంలో పార్క్ చేసిన వాహనాల్లోకి అనుకోకుండా వెళ్ళిన పిల్లలు ఊపిరాడక మృతి చెందుతున్న సంఘటనలు ఆందోళనకు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి సైబరాబాద్ పోలీస్ వారు పౌరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే, విలువైన చిన్నారుల ప్రాణాలను రక్షించగలమని పోలీస్ శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించిన కొన్ని సూచనలను పోలీసులు ప్రజలకు తెలిపారు. Read Also: AP Govt: మనుషులకు ఆధార్…