ఇకపై విమానాల్లో ప్రయాణించాలనుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందే. ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్తగా కొన్ని నిబంధనలను తీసుకువచ్చింది. అనవసర ఖర్చులను తగ్గించేందుకు ఈ నియమాలను రూపొందించింది. ప్రభుత్వ ఉద్యోగులు విమానాల్లో ట్రావెల్ క్లాసులో అతితక్కువ ధర ఉన్న టికెట్ క్లాస్ నే ఎంచుకోవాలని.. పర్యటనలు, ఎల్టీసీ కోసం వెళ్లే వారు మూడు వారాల కన్నా ముందుగా టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది. ఉద్యోగులు తమ ప్రయాణానికి ఒక్కో టికెట్ మాత్రమే బుక్ చేసుకోవాలని,…