నాలుగు బోధనాసుపత్రుల్లో సీటీ, ఎంఆర్‌ఐ పరికరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ముఖ్యమంత్రి వైయస్.జగన్. రాష్ట్రంలోని 11 టీచింగ్ ఆస్పత్రులు ప్రస్తుతం ఉంటే కేవలం 7 ఆస్పత్రుల్లో మాత్రమే సీటీ, ఎం ఆర్‌ఐ సదుపాయాలు ఉన్నాయి. ఈ ఏడింటిలో కూడా పీపీపీ పద్దతిలో, టెక్నాలజీ అప్‌డేట్స్ లేకుండా ఉన్నాయి. 4 చోట్ల అస్సలు ఇలాంటి పరికరాలు, సదుపాయాలు లేవు. మనం 16 కొత్త టీచింగ్ ఆస్పత్రులను తీసుకు వస్తున్నాం. వ్యాధి నిర్ధారణ పరికరాలు అందుబాటు ఉండాలనే దృక్పథంతో…