రైతులకు, మిల్లర్లకు శుభవార్త చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. మిల్లర్లు, రైతులు.. సీఎంను కలిసి పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వరిధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్నామని తెలిపారు.. రాష్ట్రం దేశానికే అన్నపూర్ణ.. ఇతర రాష్ట్రాలకు చేసే ఎగుమతులను మరింతగా ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు.. ఇక, ఇతర రాష్ట్రాలకు బియ్యం ఎగుమతి చేసే సందర్భంగా ఇచ్చే (01.04.2015 నుంచి 30.06.2017 మధ్య కాలంలో) 2 శాతం సీఎస్టీ…