(మార్చి 22తో ‘కంచుకోట’కు 55 ఏళ్ళు పూర్తి)విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, నటరత్న యన్.టి.రామారావు అత్యధిక జానపద చిత్రాలలో కథానాయకునిగా నటించి అలరించారు. ఆయన నటించిన అనేక జానపదాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక పంపిణీదారులకు, ప్రదర్శనశాలల వారికి యన్టీఆర్ జానపద చిత్రాలే కామధేనువుగా నిలిచాయి. ఆ రోజుల్లో ఏ థియేటర్ లోనైనా సినిమా లేకపోతే, వెంటనే యన్టీఆర్ జానపద చిత్రం వేసుకొనేవారు. సదరు చిత్రాలు రిపీట్ రన్స్ లోనూ విశేషాదరణ చూరగొనేవి. రిపీట్ రన్ లోనూ ఓ జానపద…
(మే 1న దర్శకుడు సి.ఎస్.రావు జయంతి)మేటి దర్శకుల తనయులు సైతం తండ్రుల బాటలో పయనించి జయకేతనం ఎగురవేయడం అన్నది అరుదుగా జరుగుతూ ఉంటుంది. తెలుగు సినిమా రంగంలో పలు మరపురాని చిత్రాలు అందించిన సి.పుల్లయ్య తనయుడు సి.ఎస్.రావు అలాంటి అరుదైన వారిలో ఒకరు! ఆయన పూర్తి పేరు చిత్తజల్లు శ్రీనివాసరావు. సి.ఎస్.రావు తండ్రి బాటలో పయనించి, దర్శకత్వంలో తనదైన బాణీ పలికించారు. తండ్రిలాగే దర్శకునిగా విజయపథంలో పయనించారు. తండ్రి, కొడుకు ఇద్దరూ కలసి రూపొందించిన ‘లవకుశ’ రంగుల…