RBI Governor on CryptoCurrencies: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ ఇటీవల ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అసలు వాటి వల్ల దేశానికి, ప్రజలకు ఏంటి ఉపయోగం అని నిలదీశారు. పైసా కూడా ప్రయోజనంలేని ఇలాంటివాటిని ఇంకా ప్రోత్సహిస్తే మరో ఘోర ఆర్థిక మాంద్యానికి దారితీయక తప్పదని హెచ్చరించారు. తన మాటలను రాసిపెట్టుకోవాలని, క్రిప్టో కరెన్సీలకు ముకుతాడు వేయకపోతే తాను చెప్పింది జరిగి తీరుతుందని బల్ల గుద్ది చెప్పారు.
8 బిలియన్ డాలర్లు తగ్గిన ఫారెక్స్ నిల్వలు మన విదేశీ మారక నిల్వలు ఈ నెల 8వ తేదీ నాటికి 8 బిలియన్ డాలర్లు తగ్గాయి. ఫారెక్స్ రిజర్వ్‌లను పెంచేందుకు ఆర్బీఐ ఈ నెల 6వ తేదీన కొన్ని చర్యలను ప్రకటించింది. అయితే ఆ చర్యల ఫలితాలు కనిపించటానికి కొంచెం టైం పడుతుందని ఆర్థికవేత్తలు తెలిపారు. ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు 580.3 బిలియన్ డాలర్లు ఉన్నాయి. 8 పైసలు కోలుకున్న రూపాయి. ఇటీవలి కాలంలో రికార్డు…